![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -262 లో.. గంగ, రుద్ర కలిసి శకుంతల పెద్దసారు షష్ఠి పూర్తిచెయ్యాలని అనుకుంటారు. ఆ ఫంక్షన్ కి సుధాని పిలిచి అందరిని ఒకటి చెయ్యాలని ప్లాన్ చేస్తారు. హాల్లో అందరు ఉండగా రుద్ర, గంగ వెళ్లి విషయం చెప్తారు. షష్ఠిపూర్తికి శకుంతల పెద్దసారు ఒప్పుకుంటారు. ఇక ఈ రోజు నేను కాలేజీకి వెళ్ళను.. షాపింగ్ కి వెళ్తామని స్నేహ, వంశీ అంటారు.
మీరేం కంగారు పడకండి షష్ఠిపూర్తికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు నేనే చూసుకుంటానని రుద్ర అంటాడు. వద్దని శకుంతల అంటుంది. సీతారాముల కళ్యాణం రోజు వీళ్లని వద్దంటే వినలేదు అప్పుడు ఏం జరిగిందో చూసారు కదా.. ఇప్పుడు దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు వీరు చూసుకుంటాడని శకుంతల చెప్తుంది. అత్తయ్య బావ చూసుకుంటానని అంటున్నాడు కదా.. ఎందుకని వీరు అంటాడు. నేను చెప్పినట్లు చెయ్ అని వీరుపై శకుంతల కోప్పడతుంది.
సరే అత్తయ్య అని వీరు అంటాడు. సరే పెద్దమ్మ.. మీరు చెప్పినట్లే వీరు ఏర్పాట్లు చేస్తాడని రుద్ర అంటాడు. అప్పుడే లక్ష్మీ, పైడిరాజు గుమ్మం దగ్గరుండి జరిగింది మొత్తం చూస్తారు. ఆ తర్వాత గదిలోకి వచ్చాక ఎందుకు రుద్రని వద్దన్నావని శకుంతలని పెద్దసారు కోప్పడతాడు. ఇప్పుడు వీరు చేస్తే ఏమవుతుందని శకుంతల కోప్పడుతుంది. ఆ తర్వాత షష్ఠిపూర్తి వేడుక చేస్తున్నాం తప్పకుండా రావాలని పెద్దసారు, గంగ, రుద్ర కలిసి సుధాకి ఫోన్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |